Accessibility
Translate
Link Wentworth

13 14 21

02 4726 5500

Partnerships & Growth

స్కోఫీల్డ్స్ అఫర్డబుల్ హౌసింగ్

తర్వాతి ఘట్టం

Link Wentworth చౌక గృహ నిర్మాణానికై State Significant Development (SSD) అనే ప్రతిపాదనను Department of Planning, Housing and Infrastructure వారితో నమోదు చేస్తోంది.  ఈ ప్రతిపాదనను NSW ప్రభుత్వ కొత్త SSD మార్గము కింది ఆమోదింపబడుతుంది.   

ఈ కొత్త ప్రణాళికా మార్గము, గృహాల కొరత సంక్షోభం నివారించడానికై NSW ప్రభుత్వ ప్రతిస్పందనలో భాగము. 

 

మీ అభిప్రాయాలు ఎలా తెలియజేయగలరు?

స్కోఫీల్డ్స్ స్థానిక సమాజం యొక్క సూచనలకు మరియు అభిప్రాయాలకు లింక్ వెంట్వర్త్ విలువనిస్తుంది. దయచేసి మీ అభిప్రాయాలను లేదా ప్రశ్నలను 25 జూలై 2024 లోగా పంపండి: developments@linkwentworth.org.au

లింక్ వెంట్ వర్త్ పనిచేసే భూమి యొక్క సాంప్రదాయ సంరక్షకులను గుర్తించాలని, మరియు గత, వర్తమాన, భవిష్యత్ ఆదిమ మరియు టోర్రెస్ స్ట్రెయిట్ ద్వీపవాసుల పెద్దలకు, మరియు వారి ప్రజలందరికి గౌరవాన్ని అందిచాలని మేము కోరుకుంటున్నాము.

లింక్ వెంట్వర్త్ గురించి

లింక్ వెంట్వర్త్ ఆస్ట్రేలియాలో అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న టైర్ 1 లాభాపేక్ష లేని కమ్యూనిటీ హౌసింగ్ ప్రొవైడర్ (CHPs) లలో ఒకటి. మా యాజమాన్య నిర్వహణలో 10,000 కంటే ఎక్కువ నివాసితులున్న సుమారు 6,400 గృహాలు ఉన్నాయి. కమ్యూనిటీలకు మేము అందించే సేవలు 40 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరం ఉత్సవం  జరుపుకుంటున్నాము.

మేము అత్యవసర వసతి, తాత్కాలిక వసతి, సామాజిక మరియు చౌక గృహాలు, ప్రైవేట్ అద్దె గృహాలు మరియు ఇంటి కొనుగోలుకు సులభ మార్గాలు వంటి అనేక సేవలను అందిస్తాము.

ముఖ్య ఘట్టములు

Landcom మరియు Link Wentworth మధ్య భాగస్వామ్యం ప్రకటించారు. – 2023 తుదిలో 

State Significant Development (SSD) ప్రతిపాదనను Department of Planning, Housing and Infrastructure వారితో నమోదు చేయబడ్డది. – ఆగస్టు 2024  

నిర్మాణం మొదలగును – *2026 మధ్య  

గృహస్తులు ప్రవేశించెదరు – *2027 తుదిలో

*సమయాలు ఆమోదాలు మరియు వాతావరణాన్ని బట్టి మారుతాయి. 

ప్రొజక్టు సమీక్ష

స్కోఫీల్డ్స్ లోని 108 బుర్డెకిన్ రోడ్ (Burdekin Road) వద్ద ల్యాండ్కామ్ మాస్టర్ ప్లాన్ (Landcom Masterplan) లో సరసమైన ధరలకు గృహాలను అందించడానికి లింక్ వెంట్ వర్త్ (Link Wentworth) ల్యాండ్ కామ్ (Landcom) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. రవాణా, విద్య మరియు ఉద్యోగ ప్రాంతాలతో మంచి అనుసంధానం కలిగిన 63 అపార్ట్మెంట్లను (1, 2 మరియు 3 పడకగది అపార్ట్మెంట్లతో కూడుకున్న) సరసమైన ధరలకు ఈ ప్రాజెక్ట్ అందిస్తుంది.

అల్పాదాయం నుండి మధ్యస్థాదాయం గల కీలక వర్గాల వారికి, అనగా నర్సులు, క్లీనర్లు, శిశు సంరక్షణ, వృద్ధుల సంరక్షణ, రిటైల్ వ్యాపార, ఆతిథ్య నేవ వంటి రంగాల ఉద్యోగులకు ఈ గృహాలు అందుబాటులో ఉంటాయి.

సరసమైన ధరలకు గృహాలు అనగా

సరసమైన ధరలకు గృహాలు అనగా ప్రైవేట్ మార్కెట్ ధర కన్నా 20-25% తక్కువ అద్దెలను సూచిస్తుంది. అల్పాదాయం నుండి మధ్యస్థాదాయం ఉన్నవారు ఇతర అత్యవసర కుటుంబ ఖర్చులతో పాటు ఇంటి అద్దెను కూడా చెల్లించగలుగుతారు. సరసమైన ధరలకు నిర్మించిన గృహాలు ఇతర గృహాల మాదిరిగానే డిజైన్ నాణ్యత మరియు ఉన్నత జీవన ప్రమాణాలను అందిస్తాయి, అదే విధంగా అవి విభిన్న సామాజి  వర్గాలకు చెందిన ప్రజల అవసరాలను కూడా తీరుస్తాయి.

స్కోఫీల్డ్స్ ప్రొజక్టు ఆవశ్యకత ఏమిటి?

ఇండ్లను కొనగల స్థోమత అనేది ఆస్ట్రేలియా ప్రజలు ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సమస్యలలో ఒకటి, ప్రత్యేకంగా అల్పాదాయం నుండి మధ్యస్థాదాయం గల కుటుంబాలకు. మీ కుటుంబ ఆదాయంలో 30% కంటే ఎక్కువ మొత్తం ఇంటి అద్దె లేదా తనఖా చెల్లింపులకు ఖర్చు చేసినట్టైతే మీరు గృహ ఒత్తిడికి గురైనట్టు. దానివల్ల ఇతర ముఖ్యమైన కుటుంబ  ఖర్చులను తీర్చుకోలేని ప్రమాదం కలుగుతుంది.

ముఖ్యంగా అల్పాదాయం మరియు మధ్యస్థాదాయ కుటుంబాలు గృహ సంక్షోభం ప్రభావానికి గురౌవుతున్నారు. వీరిలో ప్రథానమైన సేవలను అందించే, అనగా,  నర్సులు, పోలీసు అధికారులు, క్లీనర్లు, శిశు సంరక్షణ, వృద్ధుల సంరక్షణ, రిటైల్, ఆతిథ్య సేవలు వంటి రంగాల కీలక ఉద్యోగులు ఉన్నారు.  

కీలక అనుసంధానము

స్కోఫీల్డ్స్ అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్ అనేక ఉపనగరాలలో అనేక ప్రాంతాలలో సరసమైన ధరలకు గృహాలను అందించే అనేక రాష్ట్ర ప్రభుత్వ కీలక పథకాలతో అనుసంధానమై ఉన్నది.

State Environmental Planning Policy (Affordable Rental Housing) 2009

ఈ యోజన ప్రజలు అద్దెకు లేదా కొనుగోలుకు అందుబాటులో ఎక్కువ గృహాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది, మరియు దానికై డెవలపర్లు (developers) మరియు కమ్యూనిటీ హౌసింగ్ ప్రొవైడర్లు (Community Housing Providers) కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.

Blacktown Housing Strategy 2020

బ్లాక్టౌన్ కౌన్సిల్ 20 సంవత్సరాల ‘హౌసింగ్ విజన్’ను వెలువరచింది. ఇది ప్రస్తుత మరియు భవిష్యత్  కాలాలలో విభిన్న సామాజిక అవసరాలకు తగిన మౌలిక సదుపాయాలు కలిగిన గృహాలను సరసమైన ధరలకు అందించడాన్ని ప్రోత్సహిస్తుంది.

National Housing Accord – ఈ ప్రణాళిక ద్వారా, కామన్వెల్త్ ప్రభుత్వం 2024/25 నుండి 5 సంవత్సరాల వరకు 10,000 గృహాలను సరసమైన ధరలకు పంపిణీ చేసే నిమిత్తం 350 మిలియన్ డాలర్లు మద్దత్తు తెలిపింది. అదనంగా 10,000 చౌక గృహాల పంపిణీకి మద్దత్తు ఇవ్వడానికి రాష్ట్ర మరియు టెర్రిటొరీ ప్రభుత్వాలు అంగీకరించాయి. ఈ ఒప్పందం కింద మొత్తం 20,000 దాకా చౌక గృహాలు నిర్మించబడతాయి.